శ్రీ ధునీవాలా దాదా
దత్తపరంపరలో నవదత్తులలో ఒకరైన ధునీవాలా దాదా ఒకరు.
ధునీవాలా దాదా షిర్డికి దగ్గరలో ఖాండ్వ అనే ప్రాంతం లో ఉండేవారు.షిర్డిసాయిబాబా
లాగనే ఈయన కుడా ఎక్కడ నుండి వచ్చారో,పేరుఏమిటో,ఊరుఏమిటో కూడా ఎవరికి తెలియదు.
1.....రోజు ధునీని నిర్వహిస్తుండడం వలన ఈయనను ధునీవాలా దాదా అని పిలుస్తుడేవారు.
నర్మదానది దగ్గర కౌసర్ కి దగ్గరలో ఉన్న అడవిలో తపస్సు చేస్తుండేవారు.ఒక రోజు దాదా ఆచూకి కోసం
చూస్తుండగా అడవిలో ఒక చెట్టు దగ్గర పాముచే కాటువేయబడి చనిపోయిన దాదాను శిష్యులు గమనించారు.
అప్పటికే దాదా చనిపోయి కొన్నిరోజులు అయినది.
శిష్యులు దాదాని అక్కడనే సమాధి చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చి దాదా మరణించినట్లు అందరికి చెప్పారు.
కొన్నివారాల తర్వాత....హోషంగాబాద్ అనే ప్రాంతంలో అందరితో దాదా మాట్లాడుతుండేవారు.
దాదా శిష్యులకు విషయం తెలుసుకొని దాదాను కలవగా దాదా
వారితో పేరుపేరున పిలిచి మాట్లాడారు.శిష్యులు దాదా తిరిగి వచ్చినట్లు నమ్మారు.
ఈవిషయం తెలుసుకున్న బ్రిటిష్ వారు దాదా శిష్యులు మాటలను విశ్వసించలేదు.
బ్రిటిష్ వారు దాదా మీద నిఘా ఉంచారు.
ఒక సారి పేద విద్యార్ధి వీధి దీపాల కింద చదువుతుండగా ఒక పోలీసు అధికారి ఆ అబ్బాయి మీద తప్పడు కేసుపెట్టి జైలులో వేశారు.
ఈ విషయం తెలుసుకున్న దాదా అన్నివీధి దీపాలు పగలకొడతుండగా ఆ పోలీసు అధికారి చూసి దాదా ని జైలులో పెట్టి
బయట చూడగానే దాదా కనిపించారు.మరల లోపలకి వెళ్ళి జైలు లో చూడగా అక్కడా దాదా కనిపించారు.ఇలా పదేపదే
బయట,లోపల కనిపించడంతో ఆ పోలీసు అధికారి దాదా మహిమ గల వ్యక్తి అని బయటకు పంపిచేసారు.
2....దాదా భక్తులతో కలసి నర్మదా నది ఒడ్డన భజన కీర్తనలు పాడుతుండగా భక్తి పారవశ్యంలో ఒక బావిలో పడిపోగా
దాదాను బయటకు తీసి చూడగా దాదా చనిపోయి ఉన్నారు.పోలీసు అధికారి దాదా ను పరిశీలించి దాదా చనిపోయారు అని
నిర్దారించి దాదాను సమాధి చేసారు.అక్కడే
చ్చారు.గతంలో దాదా
మరణించినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన పోలీసు అధికారి దాదా మరల బ్రతికిన విషయం తెలుసుకోని దాదా వద్దకు వెళ్ళగా దాదా
ఆయన పేరు పెట్టి పిలిచి మాట్లాడారు.అనుమానంతొ పోలీసు అధికారి తిరిగి వెళ్ళి దాదా సమాధి తవ్వి చూడగా దాదా శరీరం డీకంపోజ్ అపోయి
ఉండడం చూసి ఆ పోలీసు అధికారి దాదా మహిమలు చూసి దాదా కాళ్ళు మీద పడి భక్తులుగా మారిపోయారు.
3.....మరో సారి దాదా నర్మదా నది పుష్కరాలో నది లో పడి దాదా మునిగిపోయారు.అప్పడు దాదా శరీరాన్ని బయటకు తీసి మూడు రోజులు
ఉంచి దాదా తిరిగి వస్తారేమో అని భావించి సమాధి చేయకుండా దహనం చేసారు.మరల ఒక నెల తర్వాత సిరిసిరి సింధూర్ అనే ఊరులో
దాదా మరల కన్ఫించారు.అక్కడ నుండి కాండ్వా వచ్చి చివర వరకు దాదా కాండ్వా లో ఉండి భక్తులతో ఇక నేను సమాధి అవుతాను అని
మరల తిరిగి రాను అని అక్కడనే సమాధి అయిపోయారు.
ధునివాలా దాదా జీవిత కాలంలో చాలా అద్బుతాలు చేశారు.చనిపోయిన పక్షి పిల్లలను ఆయన మీదకు విసరగానే ప్రాణం పోసుకోని పైకి ఎగిరిపోమేవి.
దాదా కు చనిపోయిన కుక్కను బహుమతిగా ఇస్తే తిరిగి కుక్కను బ్రతికించారు.దాదా కు భక్తుడైన రామక్రిష్ణ గారి భార్య పాము కాటుతో మరణించింది.
విషయం తెలుసుకున్న దాదా ఆమె నోటిలో రోట్టి ముక్క ఉంచమని ఇచ్చి తిరిగి బ్రతికించారు.దాదా డిసెంబరు 03వతేది 1930 సంవత్సరం నాడు శరీరాన్ని
విడిచారు.ఇప్పటికి దాదా సమాధి నుండి భక్తుల కోరికలు తీరుస్తుంటారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి