google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: శ్రీ ఆంజనేయ దండకము ( Sri Anjaneya Dandakamu )

Translate

9, ఏప్రిల్ 2022, శనివారం

శ్రీ ఆంజనేయ దండకము ( Sri Anjaneya Dandakamu )


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం।ప్రకీర్తి ప్రదాయం ।భజే వాయుపుత్రం,

భజే వాలగాత్రం,భజేహం పవిత్రం।భజే సూర్యమిత్రం।భజే రుద్రరూపం।భజే బ్రహ్మతేజం।

బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసి నీరూపు వర్ణించి నీ మిదనే

దండకం బొక్కటిన్ జేయ నూహించి నీమూర్తి గావించి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై।

రామభక్తుండనై।నిన్నునే గొల్చెదన్।నీ కటాక్షం బునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే 

నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంత వాడన్।దయా శాలివై జూచితే దాతవై 

బ్రోచితే దగ్గరం బిల్చితే తొల్లి సుగ్రీవుకున్మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం జూచి 

వారిన్విచారించి సర్వేశుపూజించి యబ్భానుజుం బంటు గావించి యవ్వాలినిన్ జంపి కాకుత్స్థ తిలకం దయాదృష్టి

వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్ధమై లంక కేతెంచియున్।లంకిణిన్ గొట్టియున్।లంకయుం గల్చియున్।భూమి

జన్ జూచి యానంద ముప్పొంగ యాయుంగరంబిచ్చి యా రత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునిన్

చేసి।సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి యా సేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై 

దైత్యులం ద్రుంచగా।రావణుండంత కాలాగ్ని యుగ్రుండుడై పోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి 

యాలక్మ్షణున్ మూర్ఛ నొందింపగా,నప్పుడే బోయి సంజీవియుందెచ్చి సామిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా 

కుంభకర్ణాది వీరాళితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగానంత లోకంబు లానందమై 

యుండ।నవ్వేళలన్ న వ్విభీషణున్వేడుకన్ దోడుక న్వచ్చిపట్టాభిషేకంబు జేయించి।సీతా మహాదేవినిన్ దెచ్చి

శ్రీరాముకున్నిచ్చి యయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు

మన్నించినన్ సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తన ల్జేసితే పాపముల్బాయునే భయములున్దీరునే 

భాగ్యముల్గల్గునే సకల సామ్రాజ్యముల్సకల సంపత్తులున్ గల్గునే వానరాకార యో భక్తమందార యో

పుణ్య సంచార యో వీర యోశూర నీవే సమస్తంబు నీవే మహాఫలమ్ముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ 

స్ధిరముగా వజ్రదేహంబు నుం దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై ఎప్పుడున్ తప్పకన్ తలతు నా జిహ్వయందుండి

నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మావై బ్రహ్మ తేజంబున్ రౌద్ర నీజ్వాల కల్లోల హావీర

హనుమంత।ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేత పిశాచ శాకినీ డాకినీ గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి

నేలంబడంగొట్టి నీ ముష్టి ఘాతంబులం బాహుదండంబులం రోమ ఖండంబులం ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ

ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునుంజూపి రారా నా ముద్దు నరసింహ యంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి

నమస్తే।వాయుపుత్రా నమస్తే।నమస్తే నమో నమః।।


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి