google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: holly-హోలీ

Translate

21, మార్చి 2019, గురువారం

holly-హోలీ

   
                  



       
        

  
హొలీ అనే పేరు సంస్కృతం నుండి వచ్చింది.


దేశప్రజలంతా  దీపావళి తరువాత హోలీని చాలా ఘనంగా జరుపుకొనే పండుగలలో ఒకటి.హోలీ అంటే రంగుల పండగ అని మన అందరికి తెలుసు.
హిందువులు ప్రతీ సంవత్సరం వసంతఋతువులో  ఫాల్గుణ మాసంలో  పూర్ణిమనాడు విశ్వవ్యాప్తంగా"రంగుల పండుగ"ను జరుపుకుంటారు. పున్నమి నాడు చేసుకొనడం వలన ఈ పండుగకు కాముని పున్నమి,డోలికోత్సవం అని పేరు.



హోలీ  పండగను చేసుకొనుటలో ఒక పరమార్ధం ఉంది అది యేమిటంటే చలికాలం ముగిసి మండువేసవి లో ప్రవేశించాం అనిఅర్ధం, అంతే కాకుండా   ఒక ఋతువు నుండి మరో ఋతువులోకి ప్రవేశించే సమయంలో చర్మం సంబంధమైన బాధలనుండి రంగులు ఉపశమనం కలిగిస్తుంది.ఈ  విధంగా హొలీని పండుగ సత్య యుగం కాలం నుండి జరుపుకుంటునట్లు పురాణాలు  తెలియజేస్తున్నాయి.

విష్ణు భక్తుడు అయిన భక్త ప్రహ్లదుని తండ్రి హిరణ్యకశపుడు కుమారుని  విష్ణు భక్తి ని ఓర్వలేక రాక్షసి సోదరి అయినటువంటి హోళికను ప్రహ్లదుని చంపమని ఆదేశిస్తాడు. రాక్షసి మాయతో ప్రహ్లదుని మంటలలోకి తీసుకు వెళ్లగా శ్రీమన్నారాయణుడు అయిన శ్రీహరిలీలలతో ప్రహ్లదుడుని కాపాడుకుంటాడు. ఆ మంటలలో రాక్షాసి మరణిస్తుంది.ఇలా రాక్షసి హోళిక మరణంతో ప్రజలందరూ హోలీని జరుపుకుంటారు.రాక్షసి మరణానికి సంకేతికంగా కొన్ని ప్రాంతాల ప్రజలు రాక్షసి ప్రతిమను ఉంచి కర్రలను కుప్పగా పోసి భోగి మంటల రూపంలో రాక్షసి దహన కార్యక్రమం నిర్వహిస్తారు. 


హోలీ పండగను భగవంతుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ పెరిగినటువంటిమధుర, బృందావనం లో16రోజులుఘనంగా నిర్వహిస్తారు. రంగపంచమినాడుశ్రీకృష్ణుడుకి రాధా పైన ఉన్న ప్రేమను కొనియాడుతారు. శ్రీ కృష్ణ భగవానుడు గోపికలతో కలసి పువ్వులతో,రంగులతో హోలీ లేదా డోలోత్సవం జరుపుకున్నట్లు భావిస్తారు.ఈవిధంగా పువ్వులు, రంగులు జల్లుకోవడం వలన ప్రేమ,సౌభాగ్యాలు కలుగుతాయి అని నమ్ముతారు.అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడిని ఫాల్గుణ పూర్ణిమ నాడు పురాణాలలో ఉన్న ప్రకారం ఉయ్యాలలోవేసినట్లు తేలుస్తుంది, అందుకే బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాల(డోలిక)లో పెట్టి రంగులు పులుమునట్లు చెబుతారు. 
హొలీ సమస్త విశ్వము ప్రకాశించే పండుగ.క్రాంతి తరంగాలు సమస్త విశ్వము ప్రయాణిస్తుంది.అనేకరకాల వర్ణాలు ఉద్భవించి అభివృద్ధి పొందుతాయి. ప్రకృతి లో ధాతువు కు పరిపూర్ణ సహజ ధర్మాలు ,లక్షణాలు సిద్ధిస్తుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి