పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు॥
రక్కసుల పాలిట రణరంగ శూరుడు
వెక్కసపు ఏకాంగ వీరుడు
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు॥
లలిమీరిన యట్టి లావుల భీముడు
బలు కపికుల సార్యభౌముడు
నెలకొన్న లంకా నిర్థూమధాముడు
తలపున శ్రీరామునాత్మారాముడు॥
దేవకార్యముల దిక్కు వరేణ్యుడు
భావింపగల తపఃఫల పుణ్యుడు
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి